గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో బెల్స్ ఎందుకు మోగించరు?

535చూసినవారు
గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో బెల్స్ ఎందుకు మోగించరు?
ఏసుక్రీస్తుకు సిలువ వేసిన ఈ రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. ఏసు సిలువ మరణాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు ఈ రోజును శోకంతో గడుపుతారు. చర్చిలలో సమావేశమవుతారు. చాలా మంది నల్లని బట్టలు ధరించి, ప్రభువు త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రార్థనలు చేస్తారు. గుడ్ ఫ్రైడే ఒక విషాద దినం కాబట్టి చర్చిలో ఈరోజు బెల్స్ మోగించరు. ఈ ఘంటల శబ్దం ప్రార్థనకు కూడా అంతరాయం కలిగిస్తుంది. ఘంటల నిశ్శబ్దం ఏసు త్యాగాన్ని గుర్తు చేస్తుంది.

సంబంధిత పోస్ట్