TG: సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైండ్ల ప్రవీణ్ పటాన్ చెరువు మండలం రుద్రారం పరిధిలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీలో తనకు వచ్చే డబ్బులు తీసుకోవడానికి శుక్రవారం అతడు బైక్ పై బయలుదేరాడు. ఈ క్రమంలో అతడి బైకును ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా.. బైక్ పై ఉన్న అతడి ఫ్రెండ్ ఇమ్రాన్ కి గాయాలయ్యాయి. ప్రవీణ్ కు ఏడాది క్రితమే పెళ్లి గాక ప్రస్తుతం అతడి భార్య నిండు గర్భవతిగా ఉంది.