లాస్ ఏంజెల్స్‌లో మళ్లీ వేగంగా కార్చిచ్చు కదులుతుంది. 50 వేల మంది నివాసాలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాన కఠిన పర్వతాల గుండా అగ్నికీలలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పాలిసేడ్స్, ఈటన్ ఫైర్ కారణంగా 28 మంది మృతిచెందగా, 14 వేల నిర్మాణాలలు బూడిదయ్యాయి. ఈ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.