సీఎం రేవంత్ సిద్దిపేటకి వస్తారా?: హ‌రీశ్ రావు

84చూసినవారు
సీఎం రేవంత్ సిద్దిపేటకి వస్తారా?: హ‌రీశ్ రావు
TG: సీఎం రేవంత్ సిద్దిపేటకి వస్తారా.. లేకపోతే ఆయన గ్రామం కొండారెడ్డిపల్లికి మ‌న‌మే పోదామా అని మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స‌వాల్ విమ‌ర్శ‌లు చేశారు. రేవంత్ స‌ర్కార్ పూర్తి రుణమాఫీ చేస్తానని పాక్షిక రుణమాఫీ చేస్తుంద‌ని ఆరోపించారు. దమ్ముంటే సీఎం రేవంత్ గ్రామ సభలకు రావాలని స‌వాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని, ఎంత రుణమాఫీ చేశారో రేవంత్ ప్ర‌భుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్