రేవంత్ ఇప్పటికైనా లెంపలేసుకుంటారా?: KTR

85చూసినవారు
రేవంత్ ఇప్పటికైనా లెంపలేసుకుంటారా?: KTR
BRS నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని MLC జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి KTR స్పందించారు. 'రేవంత్ గారు.. మీ సొంత పార్టీ నేతనే మీరు చేసిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా? జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత.. ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని, మీ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారు' అని 'X' లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్