తూటాల శబ్దంతో నిద్రలేచా: సల్మాన్‌ఖాన్‌

559చూసినవారు
తూటాల శబ్దంతో నిద్రలేచా: సల్మాన్‌ఖాన్‌
ప్రముఖ బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబయి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఘటనకు సంబంధించి సల్మాన్‌ఖాన్‌ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ రోజు ఇంట్లోనే ఉన్నానని, తూటాల శబ్దంతోనే నిద్రలేచానని సల్మాన్‌ఖాన్‌ పోలీసులకు తెలిపారు. సల్మాన్‌తో పాటు అతడి సోదరుడు అర్బాజ్‌ఖాన్‌ నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్