కొన్ని చోట్ల నివాస ప్రాంతాల్లోకి తరచూ కోతులు చొరబడుతుంటాయి. ప్రజలపై దాడులు చేస్తుంటాయి. ఇదే కోవలో అజ్మీర్‌లోని రామ్‌నగర్‌లో ఇంటి ప్రాంగణంలో కూర్చున్న ఓ మహిళపై రెండు కోతులు దాడి చేశాయి. వెనుక నుంచి వచ్చి ఆమె జుట్టును పట్టుకుని గట్టిగా లాగాయి. దీంతో కుర్చీలో ఉన్న ఆ మహిళ ప్రాణభయంతో గట్టిగా కేకలు వేసింది. అయితే ఇది ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.