అనకాపల్లిలో మహిళ దారుణ హత్య

61చూసినవారు
అనకాపల్లిలో మహిళ దారుణ హత్య
AP: అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను దుండగులు హతమార్చారు. అనంతరం శరీర భాగాలను వేరు చేసి బెడ్‌షీట్‌లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేశారు. మంగళవారం ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బెడ్‌షీట్‌లో ఒక చేయి, కాళ్లు ఉన్నట్లు గుర్తించారు. హత్యకు గురైంది ఎవరు అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్