మొబైల్‌ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దొంగను చితకబాదిన మహిళ (వీడియో)

78చూసినవారు
యూపీలో దొంగలు వీరంగం సృష్టిస్తున్నారు. మీరట్‌లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపుల్ ప్రాంతంలో శుక్రవారం షాపింగ్‌ కోసం ఒక మహిళ వచ్చింది. అయితే ఆమె చేతిలోని మొబైల్‌ ఫోన్‌ లాక్కొని పారిపోయేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో సదరు మహిళ కేకలు వేయడంతో.. అక్కడున్న వారు పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని ఆమె చితకబాది, పోలీసులకు అప్పజెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్