ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలో రోడ్డు దాటే సమయంలో మహిళను బస్సు ఢీకొట్టింది. కర్నూలు నుంచి నారాయణపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఆమె రోడ్డు దాటుతుండగా మలుపు తీసుకుంటూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ బస్సు కింద పడి మృతి చెందింది.