పోలీసును కారుతో ఢీకొట్టిన మహిళ (వీడియో)

74చూసినవారు
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఉన్నత కుటుంబానికి చెందిన మహిళ టోల్‌ప్లాజా వద్ద రచ్చ చేసింది. ఓవర్ స్పీడ్‌తో కారును నడపడంతో ఆమెను ఓ పోలీసు అధికారి అడ్డుకున్నారు. ఆమెకు చలాన్ జారీ చేశారు. దీంతో పోలీసులతో ఆమె వాగ్వాదం పెట్టుకుంది. కారుకు ఎదురుగా నిలబడ్డ పోలీసును ఢీకొట్టి వాహనం ముందుకు పోనిచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె తీరుపై విమర్శలొస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్