AP: శ్రీసత్యసాయి జిల్లా కదిరి బస్టాండ్‌లో గుర్తు తెలియని మహిళ తన 5 నెలల చిన్నారిని వదిలేసి వెళ్లిపోయింది. బాత్రూమ్‌కి వెళ్లొస్తానని చిన్నారిని మరో మహిళకు ఇచ్చి వెళ్లింది. ఎంతసేపైనా మహిళ రాకపోవడంతో మరో మహిళ చిన్నారిని కదిరి పోలీస్ స్టేషన్‌లో అప్పగించింది. మహిళపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. పాపకు ఐసీడీకి అప్పగించారు. మహిళ గురించి వివరాలు తెలిస్తే ఫోన్: 94407 96851కు కాల్ చేయాలని కదిరి సీఐ నారాయణ రెడ్డి తెలిపారు.