రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాఖీలు కట్టిన సభ్యులపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు ఆరుగురు సభ్యులకు కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద నోటీసులిచ్చారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సభ్యులు రాఖీలు కట్టడం సరికాదన్నారు. కమిషన్ ప్రాంగణంలోకి సెల్ ఫోన్లను రహస్యంగా తీసుకెళ్లి, రాఖీ కట్టిన వీడియోలను చిత్రీకరించడం తగదని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను శనివారం విచారణకు హాజరయ్యారు.