భారత్ లో కోటీశ్వరుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా ఆదాయపు పన్ను శాఖ ఓ డేటా రిలీజ్ చేసింది. దీని ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 23 మంది వ్యక్తులు మొత్తం స్థూల ఆదాయంలో రూ.500 కోట్లకు పైగా సంపాదించారని తెలిసింది. అలాగే 262 మంది వ్యక్తులు రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆర్జించారు. రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య 436 మంది వ్యక్తులు ఉన్నారు. రూ.5.5 లక్షల నుంచి రూ.9.5 లక్షల ఆదాయం ఉన్న వారు అత్యధిక పన్ను రిటర్న్ లు దాఖలు చేశారు.