కడప జిల్లా సిద్ధవటం మిట్ట ప్రాంతంలో చిరుతపులి సంచరించింది. గ్రామంలో ఒక్కసారిగా చిరుతపులి రావడంతో స్థానికులు భయపడి పరుగులు తీశారు. అందరూ కేకలు వేయడంతో చిరుతపులి అడవిలోకి పారిపోయింది. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుత పాద ముద్రలు సేకరిస్తున్నారు.