2007లో రాహుల్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. దీంతో పాటుగా కాంగ్రెస్ యువజన విభాగం NSUI ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి.. తన సమీప ప్రత్యర్థిపై 3,70,000 ఓట్ల తేడాతో ఎంపీగా గెలిచారు. 2009లో మానవ వనరుల అభివృద్ధి స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా రాహుల్ నియమితులయ్యారు. 2011లో భట్టా పారాసుల్ గ్రామంలో రైతుల తరుఫున పోరాటం చేశారు.