ఎంత డబ్బు ఇచ్చినా అలాంటి ప్రదర్శనలు చేయను: కంగనా

70చూసినవారు
ఎంత డబ్బు ఇచ్చినా అలాంటి ప్రదర్శనలు చేయను: కంగనా
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో సెలబ్రిటీలు డాన్సులు చేయడంపై నటి కంగనా రనౌత్ సెటైర్లు వేశారు. తనకు ఎంత డబ్బు ఇచ్చినా అలాంటి ప్రదర్శనలు చేయనని ఇన్‌స్టా వేదికగా చెప్పారు. 'ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పెళ్లిళ్లలో, అవార్డుల వేడుకలలో ప్రదర్శన ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. నేనూ అంతే. డబ్బు కంటే గౌరవం ముఖ్యం అని బలంగా నమ్ముతా' అని కంగనా తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్