విద్యార్థుల్లో స్కిల్ అప్‌గ్రెడేషన్ కోసం కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. 'విధానాలు రూపకల్పనలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదు. కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో కూడా మనం రాష్ట్రం ముందుంది. ఐటీ, ఫార్మా అభివృద్ధికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసింది. ప్రతి ఏడాది లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తాం’’ అని వ్యాఖ్యానించారు.