చాలా మంది లొట్టలు వేసుకుని మ్యాగీ నూడుల్స్ తింటుంటారు. అయితే మ్యాగీ తినాలని తహతహలాడే వారు ముందుగా దానిని పరిశీలించాలి. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ పరిధి కటంగిలో అంకిత్ సెంగార్ అనే వ్యక్తి ఇటీవల ఓ షాపులో మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. దానిని వండే ముందు ప్యాకెట్ విప్పగా పురుగులు కనిపించాయి. మ్యాగీని నీళ్లలో వేయగానే పురుగులు పైకి తేలాయి. దీనిపై వినియోగదారుల కోర్టును అంకిత్ ఆశ్రయించాడు.