WOW: భక్తులను ఆశీర్వదిస్తున్న ‘వినాయకుడు’..(వీడియో)

73చూసినవారు
ఏపీలోని నెల్లూరు జిల్లాలో వినాయక చవితి సందర్భంగా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో ఆక్రిలిక్ ముత్యాలతో 'కదిలే గణపతి" ని ఏర్పాటు చేశారు. దాదాపు 36 వేల ముత్యాలతో 13 అడుగుల ఎత్తుతో కదిలే గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. వినాయకుని చెయ్యి, కళ్లు కదులుతూ భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు విగ్రహాన్ని రూపొందించారు. దాదాపు రూ.1.50 లక్షలు ఖర్చు చేసి నెల రోజులపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. గత పదేళ్లుగా ఠాగూర్ టీమ్ ఈ వేడుకలను వినూత్నంగా నిర్వహిస్తోంది.

సంబంధిత పోస్ట్