ఆలేరు మండల పరిధిలోని కొలనుపాక గ్రామంలో ఉద్యానవన శాఖ మరియు వ్యవసాయ శాఖవారి ఆధ్వర్యంలో సోమవారం రైతులకు ఆయిల్ పామ్ పంట సాగుపై అవగాహన కల్పించారు. ఆయిల్ పామ్ పంట సాగుచేసిన మూడో సంవత్సరం నుండి 30 సంవత్సరాల వరకు దిగుబడిన అందిస్తుంది. ఈ పంటకి కోతుల నుండి గాని తెగుళ్లు వ్యాధుల నుండి గాని ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆసక్తి కలిగిన రైతులు వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన అధికారులను కలిసి దరఖాస్తులను సమర్పించాలని కోరారు.