మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పధం లో ముందుకు తీసుకొని వెళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలం గౌరాయ పల్లి గ్రామంలోని చెరువులో 30, 000 చేప పిల్లలను జిల్లా కలెక్టర్ హనుమంతు కె. జండగే తో కలిసి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను చెరువులలో వదలడం వల్ల మత్స్యకారులకు ఆర్థికంగా ఎదగడానికి వీలుంటుందని అన్నారు