యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కొలనుపాక సోమేశ్వరాలయ ప్రాంగణంలోని చండికాంబ గుడి ద్వార బంధం కింద గడపగా శ్రీమతు కాకతీయ గణపతిదేవ మహారాజులు అని రాసి ఉన్న శాసన ఫలకాన్ని పెట్టారు. ఇటీవల దేవాలయం పునరుద్ధరణ సమయంలో కూడా ఈ శాసనాన్ని గమనించి తీసివుండాల్సింది. ఇంకా దేవాలయంలో ఇలాంటి శాసనాలు, విగ్రహలు నిరాదరణకు గురైనాయని, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి కార్యదర్శి కుండె గణేశ్ తన ఆవేదనను వ్యక్తం చేసాడు.