యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మీ శ్రీ నరసింహస్వామి హర్యానా గవర్నర్ బండారి దత్తాత్రేయ దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భాస్కరరావు ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.