యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం ఉ. 6. 05 నిమిషాలకు స్వామివారి సామూహిక గిరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈసందర్భంగా ఆలయ ఈ. వో భాస్కరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గిరి ప్రదక్షణ కార్యక్రమంలో యావత్ మంది దేవస్థాన సిబ్బంది పోలీసులు, స్థానికులు మీడియా సిబ్బంది నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.