భారత్ బంద్

958చూసినవారు
భారత్ బంద్
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం మహదేవ్ పూర్ గ్రామంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భారత్ బంద్ లో సోమవారం పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో నూతన వ్యవసాయ చట్టాల ద్వారా రైతన్నలు కార్పొరేట్ బానిసలుగా తయారు చేయడం జరుగుతుందని అన్నారు. ఇటు రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పోడు భూములు నేడు రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటూ రైతన్నలకు మోసం చేస్తుందని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి, వేణు గౌడ్, శేఖర్ రెడ్డి, కొండల్, ఎండి జాంగిర్, లింగస్వామి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్