భువనగిరి
కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి మండలంలోని పలు గ్రామాలలో గడపగడపకు ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ దౌర్జన్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే లబ్ధి చేకూర్చుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటేసి
కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి
కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.