యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ హాస్టల్ ని జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులపై మండిపడ్డారు. కేర్ టేకర్ రమేష్ ను సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్ కి షోకాజ్ నోటీసు జారీ చేశారు. మధ్యాహ్న భోజనం లో కొత్త మెనూ పాటించడం లేదు అని మండిపడ్డారు. డైనింగ్ హాల్ శుభ్రం లేకపోవడం తో కేర్ టేకర్ రమేష్ ని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.