ఆవులను అక్రమంగా కబేళాకు తరలిస్తున్న వాహనాన్ని హిందు వాహిని సభ్యులు అడ్డుకొని భువనగిరి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రెండు బొలెరో , ఒక డిసిఎం వాహనంలో అక్రమంగా 42 ఆవులను కాకినాడ జిల్లా తుని నుంచి హైదరాబాద్ బహదూర్పూర్ తరలిస్తుండగా భువనగిరి పట్టణ శివార్లలో నల్లగొండ ప్లైఓవర్ వద్ద బుధవారం హిందు వాహిని సభ్యులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.