ప్రజా ఉద్యమాల ద్వారా ఏదైనా సాధించగలం అని నిరూపించిన కొండమడుగు గ్రామస్తులు

2848చూసినవారు
ప్రజా ఉద్యమాల ద్వారా ఏదైనా సాధించగలం అని నిరూపించిన కొండమడుగు గ్రామస్తులు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో ఉన్నటువంటి మూడు కెమికల్ కంపెనీల ద్వారా విడుదలయే రసాయనాల తోటి గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులతో పాటు అనారోగ్య పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇది గమనించిన గ్రామ ప్రజలు ఈ కంపెనీలను శాశ్వతంగా గ్రామంలో నుంచి తొలగించాలని గత 133 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ కంపెనీలను శాశ్వతంగా గ్రామం నుంచి తొలగించాలని ఎక్కని ఆఫీసు మెట్లు లేవు మొక్కని దేవుడు లేడు అన్న విధంగా 133 రోజుల తర్వాత ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు శాశ్వత పరిష్కారం చూపించిన తెలంగాణ పొల్యూషన్ బోర్డ్ అధికారులు. మూడు కెమికల్ కంపెనీలకు గ్రామం నుంచి తొలగించినందుకు సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆనందం వ్యక్తపరిచారు. అలాగే బీబీనగర్ మండల ఏఈ కి కంపెనీ క్లోజింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెరుకు భాస్కర్, ఆర్మూల జాంగిర్, బండిమీద శ్రీరామ్, గాండ్ల రవి, పెంటబోయిన ఎట్టయ్య, అరిగే వెంకటేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్