నారాయణపురం లో మహాధర్నా

498చూసినవారు
నారాయణపురం లో మహాధర్నా
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర డీఎస్ పీ దళిత శక్తి ప్రోగ్రాం సంస్థన్ నారాయణపురం మండల కమిటి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహహించడం జరిగింది. జనవరి 26 న జెండా ఆవిష్కరణ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని, భారత రాజ్యాంగం ప్రతిమను ఉంచాలని అలాగే భారత రాజ్యాంగ పీఠికను చదివించలని గత 3 సంవత్సరాలుగా 30 జిల్లాల కలెక్టర్లకు 500 మండలాలలో ఎమ్మార్వో లకు రిప్రజెంటేషన్ ఇచ్చిన కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కో కన్వీనర్ లింగస్వామి మహారాజ్, జిల్లా ట్రెజరర్ గాలయ్య మహారాజ్, మండల కన్వీనర్ సంజీవ్ మహారాజ్, కో కన్వీనర్ శాంతి కుమార్ మహారాజ్, సందీప్ మహారాజ్, సాయి మహారాజ్, కిరణ్ మహారాజ్, శివరాజ్ మహారాజ్, నా ఉద్యోగ బాధ్యులు అంబేద్కర్ మహారాజ్, రాష్ట్ర బాధ్యులు శ్రీను యాదవ రాజ్, కోఆర్డినేటర్ చంద్ర మహారాజ్, శివాజీ మహారాజ్, నగేష్, మహరాజ్, మహేంద్ర మహారాజ్, హరికృష్ణ మహారాజు, సురేష్ మహారాజ్ తదితరులు గ్రామ గ్రామాల నుంచి మహారాజులు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్