మత్స్యాద్రి వేములకొండ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 32వ రోజు వేములకొండ అంబేద్కర్ చౌరస్తా లో నిరసన చేపట్టారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మండలంగా ప్రకటించాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఎలాగందుల రవీందర్, అంబటి మోహన్, అంబటి సత్తయ్య, అరూర్ రమేష్, రెబ్బస్ మత్స్యగిరి కుమార్, మోగిలిచెర్ల యాదయ్య, యువకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.