యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలాన్ని విభజించి నూతన మండలంగా మత్స్యాద్రి వేములకొండ గ్రామాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ 12 వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. 12 రోజులుగా మండలం కొరకు ప్రజలంతా రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని, ఇప్పటికైన మండలాన్ని ప్రకటించి అన్ని రకాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇట్టి నిరసన కార్యక్రమాలలో సామ రాంరెడ్డి, ఎలాగందుల అంజయ్య, బోడ సుదర్శన్, ఆకుల వెంకన్న, బోడ బాలయ్య, జక్కలా మత్స్యగిరి, ఎలాగందుల రవీందర్, మార్కండేయ, కొత్త రామచందర్, అంబటి మోహన్, యాదగిరి, పులిపాలుపుల మల్లయ్య, బరిశెట్టి పద్మయ్య, అరూర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.