ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయని అనకాపల్లి లోక్‌సభ కూటమి అభ్యర్థి(భాజపా) సి.ఎం.రమేశ్ అన్నారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు కూటమికి మద్దతిచ్చారని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లెక్కింపు రోజున కూటమి ఏజెంట్లు సంయమనంగా ఉండాలని కోరారు. సర్వే అంచనాలు ప్రతికూలంగా రావడంతో తగాదాలు సృష్టించాలని వైసీపీ శ్రేణులు యత్నిస్తున్నాయని అన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు.