దేశం గర్వపడేలా చేశావు వినేశ్‌: రాహుల్‌ గాంధీ

50చూసినవారు
దేశం గర్వపడేలా చేశావు వినేశ్‌: రాహుల్‌ గాంధీ
ప్రపంచ ఛాంపియన్‌ రెజ్లర్లను మట్టికరిపించి, ఫైనల్స్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం విచారకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం సవాల్‌ చేసి.. వినేశ్‌కు న్యాయం చేకూర్చుతుందని ఆశిస్తున్నాం. వినేశ్‌ ధైర్యాన్ని కోల్పోయే క్రీడాకారిణి కాదు.. రెట్టించిన ఉత్సాహంతో ఆమె మళ్లీ రంగంలోకి దిగుతుందని విశ్వసిస్తున్నాం. వినేశ్‌నువ్వు ఎల్లప్పుడూ దేశం గర్వపడేలా చేశావని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్