లండన్‌లోని ఓ పాకిస్థానీ అమ్మాయిని దుకాణదారులు నిర్బంధించారు. ఓ దుకాణంలో కబాబ్‌లను దొంగిలిస్తూ ఆమె పట్టుబడింది. కబాబ్‌లు దొంగిలించాక వెంటనే మరో దుకాణానికి వెళ్లింది. ఆ దుకాణానికి మొదటి దుకాణ నిర్వాహకులు సమాచారం అందించారు. దీంతో ఆమెను లోపల ఉంచి షాపు లాక్ చేశారు. తనను విడిచి పెట్టాలని ఆ యువతి గట్టిగా కేకలు వేసింది. ఇది ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.