పెళ్లికి కొత్త బట్టలు కొనియ్యలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ సురేష్ వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండలం పెద్దనాగరం గ్రామానికి చెందిన మనుష(22) అనే యువతి ఈనెల 6న పురుగుల మందు తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం యువతి మరణించింది. బాబాయ్ బిడ్డ పెళ్లికి కొత్త బట్టలు కొనియ్యలేదని మనస్తాపం చెంది తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్టు తల్లిదండ్రులు తెలిపారు.