సముద్రంలోకి కొట్టుకుపోయిన యువతి (వీడియో)

65చూసినవారు
రష్యాలోని సోచిలో ఇటీవల విషాద ఘటన జరిగింది. ఓ యువతి తన ప్రియుడితో కలిసి బీచ్‌లో స్విమ్మింగ్ చేసింది. వారిద్దరూ సముద్ర తీరంలో ఉన్న సమయంలో తుఫాన్ కారణంగా భారీగా అలలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే అతడి కళ్ల ముందే ప్రియురాలు సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఆమె కోసం మూడు రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్