ప్రతి రాశి చక్రంలో పుట్టిన వారు దానికి తగిన లక్షణాలను కలిగి ఉంటారు. కొన్ని సానుకూలమైనవి ఉంటే మరికొన్ని ప్రతికూలమైనవి ఉంటాయి. ముఖ్యంగా గ్రహాల కూటమి ప్రకారం, ప్రతి రాశిచక్ర సంకేతాల పరిస్థితి మారుతుంది. దీనిలో కొన్ని రాశిచక్ర సంకేతాలు ఆ రాశులలో పుట్టిన వారికి అదృష్టాన్ని కలిగిస్తాయి. రాశి చక్రం ఆధారణంగా ప్రజల వ్యక్తిత్వాలు, వారి లక్షణాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. వివిధ రాశిచక్రాలలో పుట్టిన వారిలో ఉండే 3 ఉత్తమ లక్షణాలు ఇలా ఉంటాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19): మీరు ఆశావాదులు. మీలో దృఢ నిశ్చయం, నిజాయితీ ఉంటుంది.
వృషభం (ఏప్రిల్ 20 - మే 20): మీరు నమ్మదగినవారు. ఈ రాశి వారిలో అంకితభావం, బాధ్యత ఉంటాయి.
మిథునరాశి (మే 21 - జూన్ 20): మీలో అనుకూల మనస్తత్తవం ఉంటుంది. మేధావి, స్నేహశీలి
కర్కాటకం (జూన్ 21 - జూలై 22): మీరు విశ్వాసపాత్రులు. సున్నితత్వం ఉన్నా దృఢంగా ఉంటారు.
సింహరాశి (జూలై 23 - ఆగస్టు 22): మీరు ఉదారంగా, ఉల్లాసంగా, సరాదాగా ఉంటారు.
కన్య (ఆగస్టు 23 - సెప్టెంబరు 22): కష్టపడి పని చేసే తత్వం ఉంటుంది. ఆచరణాత్మకంగా ఉంటారు. నమ్మదగినవారు.
తులారాశి (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22): మీరు నిజాయితీపరులు, న్యాయంగా జీవిస్తారు. రొమాంటిక్‌గా ఉంటారు.
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21): మీరు శక్తివంతంగా, ధైర్యంగా ఉంటారు. భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి.
ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21): మీరు ఉదారంగా, ఆదర్శంగా, ఆశావాదంగా ఉంటారు.
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19): మీలో క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది. ఆచరణాత్మకంగా ఉంటారు.
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18): మీరు నిజాయితీగా, న్యాయంగా ఉంటారు. మానవత్వం ఎక్కువ ఉంటుంది.
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20): మీరు దయాగుణం ఎక్కువ. ఎవరినైనా నమ్ముతారు. సహజంగా ఉంటారు.