మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాలు నీట మునిగాయి. కాలువలు, నదులు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో వరద నీటిలో రోడ్డు దాటుతున్న యువకుడు పట్టు తప్పి జారి పడ్డాడు. స్నేహితులు చూస్తుండగానే వరద నీటిలో యువకుడు కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.