ఎయిర్ ఇండియాతో జూమ్‌కార్ జట్టు

75చూసినవారు
ఎయిర్ ఇండియాతో జూమ్‌కార్ జట్టు
సెల్ఫ్ డ్రైవ్ కార్ షేరింగ్ ప్లాట్‌ఫాం సేవల సంస్థ జూమ్‌కార్.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తో జట్టుకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో హైదరాబాద్‌తో పాటు 19 విమానాశ్రయాల్లో నేరుగా సెల్ఫ్-డ్రైవ్ కారును బుకింగ్ చేసుకునే వీలుంటుంది. విమానాశ్రయాల్లో దిగిన తర్వాత క్యాబ్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని, ఎయిర్‌లైన్స్‌కు చెందిన మొబైల్ యాప్ ద్వారానే తమకు నచ్చిన కారును బుకింగ్ చేసుకునే వీలుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్