సౌదీ అరేబియాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా 51.8 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో హజ్ యాత్రకు వెళ్లిన వారిలో వడదెబ్బ కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య 1000 దాటినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. వీరిలో అత్యధికులు ఈజిప్టు దేశస్థులే కాగా.. భారత్, పాకిస్థాన్, జోర్డాన్, ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యూనిషియాకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం.