రేపు ఏడాదిలోనే ‘‘సుదీర్ఘమైన పగలు’’.. ఎందుకంటే!

82చూసినవారు
రేపు ఏడాదిలోనే ‘‘సుదీర్ఘమైన పగలు’’.. ఎందుకంటే!
జూన్ 21, అంటే రేపు ఏడాదిలోనే అతి పొడవైన పగలు ఏర్పడనుంది. రాత్రి సమయంతో పోలిస్తే పగలు సుదీర్ఘంగా ఉండబోతోంది. దీనినే మనం ‘‘ వేసవి అయనాంతం’’ అంటాం. సాధారణంగా మన భూమి 23.5 డిగ్రీలు వంగి తిరుగుతుంటుంది. ఇలా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నక్రమంలో ఒక రోజు భూమి ఉత్తరార్థ గోళం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. దీని వల్ల ‘వేసవి అయనాంతం’ ఏర్పడుతుంది. ఏడాదిలో మరోసారి ఉత్తరార్థగోళం సూర్యుడికి దూరంగా (డిసెంబర్ 21 లేదా డిసెంబర్ 22న) వస్తుంది. దీనిని‘‘ శీతాకాలపు అయనాంతం’’ అంటాం.

సంబంధిత పోస్ట్