స్థాయీ ఎన్నికల్లో వైసీపీ హ్యండ్సప్?
విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ స్థాయీ సంఘం ఎన్నికలు ఎన్నడూ లేనంత వేడిని పెంచుతున్నాయి. స్థాయి సంఘం సభ్యులు అంతా కలసి స్టాండింగ్ కమిటీ చైర్మన్ ని ఎన్నుకుంటారు. జీవీఎంసీ పాలనలో స్టాండింగ్ కమిటీదే అతి ముఖ్య పాత్ర. అయితే యాభై మంది కార్పోరేటర్ల మద్దతు ఎవరి వైపు ఉంటే వారిదే విజయం. వైసీపీకి సంఖ్యా బలం బయటకు కనిపించినా వారిలో చాలా మంది కూటమి వైపుగా షిఫ్ట్ అయ్యారట. దాంతో నలభై మంది మాత్రమే నికరంగా వైసీపీకి ఉన్నట్లు సమాచారం.