కడప పాత బస్టాండు సమీపంలో మహమ్మద్ గౌస్ అనే యువకుడు బుధవారం ద్విచక్ర వాహనం పై వెళుతూ పాత బస్టాండు సమీపంలో నిలబడిన ఆర్టీసీ బస్సును ఢీకొన్నట్లు కడప వన్ టౌన్ ఎస్సై అమర్నాథరెడ్డి గురువారం తెలిపారు. మీడియాలో బైక్ విన్యాసాలు చేసి ఆర్టీసీ బస్సును ఢీకొన్నారని వచ్చిన వార్తలో వాస్తవం లేదన్నారు. ఈ విషయంపై విచారించగా ద్విచక్ర వాహనం నడిపే సమయంలో గౌస్ కు ఫిట్స్ రావడంతో కంట్రోల్ తప్పి బస్సును ఢీకొన్నాడన్నారు.