మదనపల్లి మండలం బసినికొండలో టిడిపి ఏర్పాటు చేసిన బ్యానర్ల విషయంలో ఇద్దరు గొడవపడి ఒకరిపై మరొకరు పెప్పర్ స్ప్రేలు వినియోగించి కొట్టుకున్నారు. సమాచారం తెలుసుకుని డిఎస్పి కొండయ్య నాయుడు, సిఐ కళా వెంకటరమణ వెంటనే బసినికొండకు చేరుకొని గొడవకు గల కారణాలను తెలుసుకున్నారు. గొడవపడిన తౌఫీక్, ఆరిఫ్ వర్గీయులును పోలీస్ స్టేషనుకు తీసుకువచ్చి విచారించి పంపేయడంతో వివాదం సద్దుమణిగింది.