మిద్దె పైనుండి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందినట్లు గురువారం మదనపల్లి ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. మదనపల్లి మండలం కట్టు బావి గొల్లపల్లి కి చెందిన వెంకటరమణ(40) నిమ్మనపల్లి మండలంలోని బండ్లపై లో ఇంటి నిర్మాణం పనులు చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు మిద్దె పైనుండి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోద చేసి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు.