రంజాన్ పండుగ వేడుకలు

పులివెందుల పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు అంతా నెల రోజులపాటు ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలు చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పవిత్ర ఉపవాస దీక్షలను రంజాన్ పర్వదిన సందర్భంగా ముగించారు. గురువారం ఉదయం ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. పట్టణంలోని ఈద్గాలతో పాటు మసీదులలో కూడా ముస్లిం సోదరులు ప్రార్థనలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్