వారికి కారు అలవెన్సుగా నెలకు రూ.లక్ష

AP: రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల కార్లకు అలవెన్సుగా నెలకు రూ.లక్ష చొప్పున మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మంత్రులకు మినహా మిగతా ఎంపీలకు ఈ అలవెన్సులు వర్తించనుంది. అలాగే డిప్యూటీ స్పీకర్, ఆర్థిక మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్‌కు గృహోపకరణాల కొనుగోలుకు ఒకసారి గ్రాంటుగా రూ.1.50 లక్షల చొప్పున రూ.4.50 లక్షలు మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్