ఎలుగు బంట్లు ఉన్నట్టుండి దాడులు చేయడం సహజమే. తాజాగా అటువంటి దాడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఓ జూలో జరిగినట్టు తెలుస్తోంది. ఓ మహిళ భల్లూకానికి ఆహారం అందిస్తుండగా ఒక్కసారిగా దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇతర సిబ్బంది ఆమెను ఎలుగుబంటి నుంచి రక్షించారు. అందుకే అడవి జంతువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.